నైపుణ్యాభివృద్దికి హెచ్‌సిఎల్ తోడ్పాటు
నారా లోకేష్ తో హెచ్ సీఎల్ ప్రతినిధులు
అమరావతి – దేశంలోని ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలలో ఒకటైన హెచ్‌సిఎల్ తీపి కబురు చెప్పింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో హెచ్‌సిఎల్ విస్తరించి ఉంది. మంగళవారం కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు శివ శంకర్ , శివ ప్రసాద్ , వైస్ ప్రెసిడెంట్ మర్యాద పూర్వకంగా ఏపీ ఐటీ , పరిశ్రమల , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా వారి మధ్య ఐటీ రంగంలో చోటు చేసుకున్న పరిణామాలు, కంపెనీ విస్తరించడం, నైపుణ్యాభివృద్దికి సహకరించేలా మద్దతు ఇవ్వడం, తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు నారా లోకేష్ తో.
ఈ సందర్బంగా కొత్తగా 15,000 మందికి తమ కంపెనీలో జాబ్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. స్పష్టమైన ప్లాన్స్ తో హెచ్‌సిఎల్ ఏపీలో గణనీయమైన పురోగతి సాధించనుందని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తాము ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రారంభంలో హెచ్ సీ ఎల్ 4500 మంది ఉద్యోగులతో రాష్ట్రంలో తన పనులను ప్రారంభించింది. రెండో దశలో భాగంగా HCL కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తుందని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్దికి సంబంధించి కూడా సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా కంపెనీ ప్రతినిధులను అభినందించారు నారా లోకేష్.