హెచ్ సీ యూ విద్యార్థి సంఘాల ఆందోళన
హైదరాబాద్ – కస్టడీలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి ఈస్ట్ క్యాంపస్ వరకు ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడాలని, అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను బేషరతుగా రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్శిటీ భూ వివాదంలో స్టూడెంట్స్ మీద, మద్దతు తెలిపిన సివిల్ సొసైటీ గ్రూప్ ల మీద పెట్టిన ఎఫ్ ఐ ఆర్ లను కొట్టి వేయాలన్నారు.
శనివారం యూనివర్శిటీ ప్రాంగణంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ లోపల, బయట ఉన్న పోలీస్ క్యాంపు లను ఎత్తి వేయాలన్నారు. లేకపోతే తమ ఆగ్రహానికి సర్కార్ గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే సమయంలో 400 ఎకరాల ఓనర్ షిప్ కోసం యూనివర్సిటీ అడ్మిన్ హైకోర్టు లో పిటిషన్ దాఖాలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ విలువైన భూములను వేలం పాట వేసేందుకు రాత్రికి రాత్రి సర్కార్ బుల్ డోజర్లను దించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏప్రిల్ 7వ తేదీ వరకు స్టే విధించింది కోర్టు.