జేడీఎస్ ఎమ్మెల్యేల డిమాండ్
కర్ణాటక – పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ ప్రధాన మంత్రి హెచ్ డీ దేవ గౌడ సారథ్యంలోని జేడీఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. తాజాగా ఆ పార్టీకి చెందిన దేవగౌడ తనయుడు హెచ్ డీ రేవణ్ణ, ఆయన తనయుడు ప్రజ్వల్ రేవణ్ణలపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు వచ్చాయి.
ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ) ఏర్పాటు చేసింది. దీనిపై మాజీ సీఎం కుమార స్వామి కూడా స్పందించారు. సిట్ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. తప్పు ఎవరు చేసినా క్షమించే ప్రసక్తి లేదన్నారు.
ఇదిలా ఉండగా హెచ్ డి రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక ఆరోపణలు రావడంతో పార్టీపై పెను ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేలు. తండ్రీ కొడుకులు ఇద్దరిపై ఇప్పటికే స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి.
హెచ్‌డీ దేవెగౌడ తనయుడు హెచ్‌డీ రేవణ్ణ, ప్రజ్వల్ రేవణ్ణలను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించాలని జేడీఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కాగా ప్రజ్వల్ తన కూతురిని వీడియో కాల్స్ ద్వారా వేధింపులకు గురి చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితురాలి తల్లి.