లోకసభ బరిలో కుమార స్వామి
మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ
కర్ణాటక – జేడీఎస్ కీలక నాయకుడు, మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ సారథ్యంలోని ఈ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంది. కానీ ఊహించని రీతిలో బిగ్ షాక్ తగిలింది. చక్రం తిప్పుతానని అనుకున్న కుమారకు కోలుకోలేని షాక్ ఇచ్చారు కేపీసీసీ చీఫ్ , డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇది పక్కన పెడితే చక్రం తిప్పాలని అనుకున్న కుమారకు ఆశించిన మేర ఫలితాలు రాలేదు. ఇదే సమయంలో ఉన్నట్టుండి సార్వత్రిక ఎన్నికల్లో తాను కూడా బరిలో ఉంటానని ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కీలక నిర్ణయం ప్రకటించడం కలకలం రేపింది.
అయితే తను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం కూడా వెల్లడించారు. తాను హాసన్ లో పుట్టానని, రామనగర తన రాజకీయ ఇన్నింగ్స్ కు జన్మ ఇచ్చిందని చెప్పారు కుమార స్వామి. మాండ్యా తన రాజకీయ జీవితానికి బలం ఇచ్చేలా చేసిందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవ చేసేందుకు తాను ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.