మంత్రి హెచ్ డీ కుమార స్వామి
విశాఖపట్నం – కేంద్ర మంత్రి హెచ్ డి కుమార స్వామి కీలక ప్రకటన చేశారు. ఆయన విశాఖలో పర్యటించారు. ఈ సందర్బంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ పలుమార్లు నారా లోకేష్ తనను కలిసి విన్నవించారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం పదే పదే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయొద్దంటూ కోరారని తెలిపారు. ఆరు నూరైనా సరే విశాఖ ఉక్కుకు జీవం పోస్తామన్నారు. ఇందులో భాగంగానే భారీ ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం జరిగిందన్నారు.
కేంద్ర మంత్రి హెచ్ డి కుమార స్వామి మీడియాతో మాట్లాడారు. ఉక్కు మంత్రిగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి అవకాశం ఇచ్చారని చెప్పారు. స్టీల్ అభివృద్ది కోసం పలువురు రాష్ట్రానికి చెందిన నేతలు కలిసి చర్చించారని అన్నారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి పలుమార్లు చర్చించడం జరిగిందని వెల్లడించారు.
2030లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో మనం రెండో స్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు. ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో చైనా ఉందని , దానిని అధిగమించగలమన్న నమ్మకం తనకు ఉందన్నారు కుమార స్వామి.