NEWSNATIONAL

హెచ్‌డీ రేవ‌ణ్ణ‌..ప్ర‌జ్వ‌ల్ పై ఛార్జిషీట్ దాఖ‌లు

Share it with your family & friends

2,144 పేజీలతో నివేదిక కోర్టులో దాఖ‌లు

హైద‌రాబాద్ – లైంగిక వేధింపుల కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హెచ్ డీ రేవ‌ణ్ణ‌, కుమారుడు ప్ర‌జ్వ‌ల్ పై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన సిట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం ఈ మేర‌కు 2,144 పేజ‌ల‌తో కూడిన ఛార్జిషీట్ ను దాఖ‌లు చేసింది.

విచార‌ణ‌లో భాగంగా సిట్ 150 మందికి పైగా సాక్షులు , బాధితుల నుండి వాంగ్మూలాన్ని సేక‌రించింది. డాక్యుమెంట్ చేసిన వాంగ్మూలాలతో కూడిన విస్తృత విచారణ తర్వాత క‌ర్ణాట‌క సిట్ బృందం ఇవాళ బెంగ‌ళూరు లోని ప్ర‌త్యేక పీపుల్స్ కోర్టుకు స‌మ‌ర్పించింది.

ఇదిలా ఉండ‌గా ప్రజ్వల్ రేవణ్ణ నలుగురు మహిళలపై అత్యాచారం చేయ‌డంతో పాటు ఏకంగా 3,000 కు పైగా లైంగిక చర్యలకు సంబంధించిన వీడియోలను రికార్డ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు,

అంతే కాకుండా ఇంకా అదనపు కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి. హెచ్‌డీ రేవణ్ణ కూడా లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. వీరిద్ద‌రూ తండ్రీ కొడుకులు కావ‌డం విశేషం. రేవ‌ణ్ణ తండ్రి మాజీ దేశ ప్ర‌ధాన మంత్రి దేవెగౌడ . కుమార స్వామి ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.