ఎమ్మెల్యే హెచ్ డీ రేవణ్ణ అరెస్ట్
కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తత
కర్ణాటక – పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలు మరింత రంజుగా మారాయి. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ ఎలాగైనా సరే సీట్లు పొందాలని ప్రయత్నం చేస్తోంది. తాజాగా సంకుల సమరం బీజేపీ, జేడీఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారి పోయింది. దీంతో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.
విచిత్రం ఏమిటంటే బలమైన ఓటు బ్యాంకు కలిగిన జేడీఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ ప్రధాని ఆ పార్టీ చీఫ్ హెచ్ డీ దేవగడ తనయుడు ఎమ్మెల్యే, హెచ్ డీ రేవణ్ణతో పాటు ప్రస్తుత హసన్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణలపై లైంగిక వేధింపులకు సంబంధించి కేసు నమోదైంది. దీంతో తండ్రీ కొడుకులకు నోటీసులు అందజేసింది. ప్రధానంగా 400 మందికి పైగా మహిళలను దారుణంగా వేధించాడని, అత్యాచారానికి పాల్పడినట్లు ఎంపీ రేవణ్ణపై ఆరోపణలు ఉన్నాయి.
దీనిపై సీఎం సిద్దరామయ్య విచారణ చేపట్టేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పారి పోయాడు. దీంతో రాష్ట్ర పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే రేవణ్ణ. కోర్టు నిరాకరించడంతో సిట్ ఆయనను అదుపులోకి తీసుకుంది.