భారీ వ‌ర్షం జ‌ర భ‌ద్రం

Share it with your family & friends

హెచ్చ‌రించిన ఐంఎండీ

హైద‌రాబాద్ – బంగ‌ళా ఖాతంలో చోటు చేసుకున్న వాయుగండం ప్ర‌మాద‌క‌రంగా మారే ఛాన్స్ ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఇరు తెలుగు రాష్ట్రాల‌ను వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లి ప్ర‌వహిస్తున్నాయి. జ‌లాశ‌యాలు నిండు కుండ‌ల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. ఓ వైపు ఏపీ మ‌రో వైపు తెలంగాణ రాష్ట్రాలను వ‌ర్షాలు వెంటాడుతున్నాయి. చాలా చోట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రో వైపు భారీ ఎత్తున పంట‌ల‌కు న‌ష్టం వాటిల్లింది.

ఇక మేడిగ‌డ్డ‌కు భారీగా వ‌రద నీరు చేరుతోంది. ఇది ప్ర‌మాద‌క‌ర స్థాయిని దాటనుంద‌ని స‌మాచారం. శ‌నివారం వాతావ‌ర‌ణ కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ స‌ర్కార్ కు సూచ‌న‌లు చేసింది .తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈదురు గాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది.