అల్ప పీడనం భారీ వర్షం – కూర్మనాథ్
హెచ్చరించిన వాతావరణ శాఖ
అమరావతి – మరోసారి ఏపీని వర్షాలు రెండు రోజుల పాటు ముంచెత్తనున్నాయి. ఇదే విషయాన్ని ప్రకటించింది రాష్ట్ర వాతావరణ శాఖ. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ రోణంకి కూర్మనాథ్.
నైరుతీ బంగాళా ఖాతంలో అల్ప పీడనం ఏర్పడిందని, అది మరంత బలహీనపడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీని కారణంగా కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.
ఏకంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.. ఏపీలో అన్ని పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలిపారు.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వార్నింగ్ ఇచ్చారు డాక్టర్ రోణంకి కూర్మనాథ్… రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు.. నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు .
అవసరమైతే తప్పా బయటకు ప్రజలు వెళ్ల వద్దని, ముఖ్యంగా మత్స్య కారులతో పాటు రైతులు ఈ సూచనలు తప్పక పాటించాలని కోరారు. ఇదిలా ఉండగా వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.