NEWSANDHRA PRADESH

బంగాళా ఖాతంలో అల్ప పీడ‌నం

Share it with your family & friends

వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక

విశాఖ‌ప‌ట్నం – రాష్ట్ర వాతావ‌ర‌ణ శాఖ తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. బంగళాఖాతాలో తీవ్ర అల్ప పీడ‌నం ఏర్ప‌డింద‌ని, దీంతో అది వాయుగుండంగా మారే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని హెచ్చ‌రించింది.
అల్ప పీడ‌నం కార‌ణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

అంతే కాకుండా కొన్ని ప్రాంతాల‌లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు కూడా వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని పేర్కొంది. గురువారం నెల్లూరు-పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంద‌ని తెలిపింది వాతావ‌ర‌ణ శాఖ‌.

ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా తీరాల వైపు కదులుతోందని అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది.

గురువారం పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలకు ఆస్కారముందని పేర్కొంది.

ఈ మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, గరిష్ఠంగా గంటకు 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. పశ్చిమ-మధ్య బంగాళా ఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

అనంతపురం, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలు లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. మరో రెండు రోజులపాటు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దంటూ మత్స్యకారులకు సూచించింది.