భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ – ఐఎండీ
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
అమరావతి – ఏపీ రాష్ట్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ముందస్తు హెచ్చరిక చేసింది. బంగళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైంది ఏపీ కూటమి ప్రభుత్వం. అల్ప పీడనం కారణంగా ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయని హెచ్చరించింది.
భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకూ సూచనలు జారీ చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.
పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్బంగా కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు.
దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా ప్రాంతాలలో భారీ వర్షాల కారణంగా బలహీనంగా ఉన్న కాలువ, చెరువు గట్లను పటిష్టం చేయాల్సిందిగా ఆదేశించారు వంగలపూడి అనిత.
ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు వంగలపూడి అనిత.