భారీ వర్షం భాగ్యనగరం అతలాకుతలం
మరికొన్ని రోజుల పాటు కురిసే ఛాన్స్
హైదరాబాద్ – భారీ వర్షం ధాటికి భాగ్యనగరం తడిసి ముద్దై పోయింది. ఎక్కడ చూసినా నీళ్లే కనిపించాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి ఎక్కడికక్కడ జన జీవనం స్తంభించి పోయింది. ఇసుక వేస్తే రాలనంతగా నీళ్లు నిండి పోయాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీళ్లు కాలువల్లా ప్రవహించాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే సమయంలో కృష్ణా నగర్ లో అయితే టూ వీలర్స్ కొట్టుకు పోయాయి వరద ఉధృతికి.
ఒక్క మారేడ్ పల్లిలోనే 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంతగా కురిసిందో. ఆదివారం రాత్రి కురిసిన వానతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్ లో 7 సెంటీమీటర్లు, యూసుఫ్ గూడలో 7.4 , షేక్ పేటలో 6.9 , శేరి లింగంపల్లిలో 6.8 , ఖైరతాబాద్ లో 6.7 , ఉప్పల్ లో 6.6 , బేగంపేట లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇక కూకట్ పల్లిలో 5.6 వర్షపాతం నమోదు కాగా మల్కాజిగిరిలో 5.8 శాతం, రహమత్ నగర్ లో 5.6 వర్షం కురిసింది. ఇక చందా నగర్ , గాజుల రామారం, కూకట్ పల్లి, గోషా మహల్ , ఎల్బీ నగర్ , కార్వాన్ , అంబర్ పేట్, ఆల్వాల్ , మలక్ పేట్ , కాప్రా, సరూర్ నగర్ , సంతోష్ నగర్, ఫలక్ నుమా, రాజేంద్ర నగర్ , హయత్ నగర్ , చాంద్రాయణ్ గుట్ట , తదితర ప్రాంతాలు వర్షంతో తడిసి పోయాయి.