DEVOTIONAL

తుఫాను ప్ర‌భావం తిరుమ‌ల‌లో భారీ వ‌ర్షం

Share it with your family & friends

తిరుప‌తి జిల్లాలో విద్యా సంస్థ‌లకు సెల‌వు

తిరుమ‌ల – ఫెంగ‌ల్ తుఫాన్ ప్ర‌భావంతో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుప‌తి జిల్లా క‌లెక్ట‌ర్ శుభం బ‌న్సాల్ అన్ని విద్యా సంస్థ‌ల‌కు ఇవాళ సెల‌వు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ త‌రుణంలో ప‌విత్ర‌మైన తిరుమ‌లను వ‌ర్షాలు ముంచెత్తాయి. సుదూర ప్రాంతాల నుంచి వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి స్వామి వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన భ‌క్తులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు.

దీంతో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఈవో జె. శ్యామ‌ల రావు.
అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా తిరుమ‌లలో వ‌ర్షం కురుస్తోందని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

కొండ చ‌రియ‌లు విరిగిప‌డే ప్ర‌మాదం ఉంద‌ని, ఘాట్ రోడ్డులో వాహ‌న‌దారులు జాగ్ర‌త్త‌గా ప్ర‌యాణం చేయాల‌ని జె. శ్యామ‌ల రావు సూచించారు. వ‌ర్షాల దెబ్బ‌కు చ‌లి తీవ్ర‌త గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా పెర‌గ‌డం ప‌ట్ల ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇదిలా ఉండ‌గా గో గర్భం, పాప వినాశనం పూర్తిగా నిండింది. ఔట్ ఫ్లో పెర‌గ‌డంతో పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఈవో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *