అల్ప పీడనం ఏపీ జర భద్రం
హెచ్చరించిన వాతావరణ శాఖ
అమరావతి – భారీ వర్షాల తాకిడికి తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి వర్షాలు రానున్నాయని రాష్ట్ర వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ముందస్తు సమాచారం ఆధారంగా చేసుకుని ఏపీ కూటమి ప్రభుత్వం సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలని సూచించింది. లేకపోతే మళ్లీ వరదలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది.
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది 2 రోజుల్లో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.
దీని ప్రభావంతో పశ్చమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావవరణ శాఖ. అయితే ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం స్వల్పంగానే ఉన్నప్పటికీ రాబోయే మూడు రోజులు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని, లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని సూచించింది. మొత్తంగా బంగాళా ఖాతం అల్ప పీడనం ఏపీకి శాపంగా మారనుందని తెలిపింది.