NEWSTELANGANA

నాగార్జున సాగ‌ర్ డ్యామ్ కు వ‌ర‌ద ఉధృతి

Share it with your family & friends

కొన‌సాగుతున్న నీటి ప్ర‌వాహం ..గేట్లు ఎత్తివేత

న‌ల్ల‌గొండ జిల్లా – ఎగువ‌న కురుస్తున్న భారీ వర్షాల తాకిడికి ప్రాజెక్టుల‌లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. దీంతో అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి. మ‌రో వైపు త‌మిళ‌నాడు నీళ్ల‌లోనే ఉంటోంది. చెన్నై అంత‌టా వ‌ర్షాలు ముంచెత్తాయి.

ఇదిలా ఉండ‌గా ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల తాకిడికి వ‌ర‌ద ఉధృతి కొన‌సాగుతోంది. ఈ త‌రుణంలో న‌ల్ల‌గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మళ్ళీ వ‌ర‌ద నీరు వ‌స్తోంది. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు.

నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టుకు సంబంధించి 4 గేట్లు ఎత్తివేశారు. 8 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 64,720 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. కాగా ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ ఫ్లో1,05,777 క్యూసెక్కులు ఉండ‌గా ఔట్ ఫ్లో 1,05,777 క్యూసెక్కులుగా ఉంది.

ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులుగా ఉంది.
ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 311.7462 టీఎంసీలు ఉండ‌గా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 గా న‌మోదైంది. గేట్లు ఎత్తిన కార‌ణంగా ఎవ‌రూ కూడా ప్రాజెక్టు ప‌రిధిలోకి రావ‌ద్ద‌ని సూచించారు.