జార్ఖండ్ పీఠం హేమంత్ సోరేన్ దే
విజయం దిశగా ఇండియా కూటమి
జార్ఖండ్ – జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. భారీ మెజారిటీ దిశగా ఇండియా కూటమి దూసుకు పోతోంది. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోనున్నారు హేమంత్ సోరేన్. ఆయనపై ఎన్నో కుట్రలు చేసినా, జైలుకు పంపించినా చివరకు తననే ప్రజలు నమ్ముకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి పట్టం కట్టారు. ఆ పార్టీతో పాటు కూటమికి చెందిన కాంగ్రెస్ పార్టీ కూడా కీలక సీట్లను కైవసం చేసుకుంది.
ఇక హేమంత్ సోరేన్ వయసు 49 ఏళ్లు. ఆగస్టు 10, 1975లో పుట్టాడు. పేరెంట్స్ శిబు సోరేన్ , రూపి సోరేన్. భార్య కల్పనా సోరేన్. ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన 2013 నుంచి 2014 దాకా ముఖ్యమంత్రిగా పని చేశారు.
ఇక రెండోసారి సీఎంగా పని చేస్తున్న సమయంలో 2019 డిసెంబర్ 29న మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనను ఈడీ అరెస్ట్ చేసింది. 2024 జనవరి 31న జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జూన్ 28న జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చారు.
జూలై 4న తిరిగి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అంచనాలు వేశారు. కానీ మరోసారి జేఎంఎం సత్తా చూపింది.