NEWSNATIONAL

చెంపైని మ‌రిచి పోలేను – హేమంత్

Share it with your family & friends

కుట్ర‌ల‌ను ఛేదించుకుని విక్ట‌రీ

జార్ఖండ్ – కుట్ర‌లు, కుతంత్రాలు, వ్యూహాలు ఏవీ ప‌ని చేయ‌లేదు ఆయ‌న ముందు. మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా త్ర‌యానికి, బీజేపీ, దాని అనుబంధ సంస్థ‌ల ప‌న్నాగాలు ఏవీ వ‌ర్క‌వుట్ కాలేదు. అక్క‌డున్న‌ది ఎవ‌రు సామాన్యుడు కాదు. త‌న జీవితం అంతా పోరాటాల‌తో ముడి ప‌డి ఉన్న వాడు. అత‌డే నూత‌న సీఎంగా కొలువు తీరిన చెంపై సోరేన్. హేమంత్ సోరేన్ ను అక్ర‌మంగా ఈడీ అరెస్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన స‌మ‌యంలోనే జార్ఖండ్ లో స‌ర్కార్ కూలి పోతుందని అంతా అనుకున్నారు. కానీ సీన్ మారింది. ప్ర‌ధానంగా ఊహించ‌ని రీతిలో త‌న మైత్రీ ధ‌ర్మాన్ని మ‌రిచి పోలేదు కాంగ్రెస్ పార్టీ.

బేష‌ర‌తుగా జేఎంఎం ప్ర‌య‌త్నాల‌కు మ‌ద్ద‌తు ప‌లికింది. ఇవాళ జ‌రిగిన అవిశ్వాస తీర్మానంలో భారీ మెజారిటీని సాధించింది. ఇక త‌న‌కు , త‌న స‌ర్కార్ కు ఎదురే లేద‌ని తేలి పోయింది. ఈ సంద‌ర్బంగా సీఎం చెంపై సోరేన్ చ‌రిత్రాత్మ‌క‌మైన ప్ర‌సంగం చేశారు. ఇది పూర్తిగా ప్ర‌జాస్వామ్య విజ‌య‌మ‌ని, ఇలాంటివి పార్టీల స‌మ‌ర్థ‌త‌కు, నాయ‌కుల శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు ప‌రీక్షగా ప‌ని చేస్తాయ‌ని అన్నారు.

ఇదిలా ఉండగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స‌ర్కార్ కూలి పోకుండా కాపాడిన చెంపై సోరేన్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు మాజీ సీఎం హేమంత్ సోరేన్. రాజకీయం అంటే మాట‌లు కాదు. కానీ ఉద్య‌మ‌కారుడికి అది ఓ ఆట మాత్ర‌మే క‌దూ.