పరిటాల హత్య కేసులో ముద్దాయిలకు బెయిల్
సంచలన తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు
అమరావతి – టీడీపీ మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్ర హత్య కేసులో రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 18 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏకంగా ప్రధాన ముద్దాయిలుగా ఉన్న వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
రవిను దారుణంగా హత్య చేశారు. పార్టీ ఆపీసులో ఉన్న సమయంలో దారికాచి ఖతం చేశారు. అప్పుడు అనంతపురం జిల్లా ఎస్పీగా ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా తనకు ఎలాంటి వత్తిళ్లు రాలేదని కొట్టి పారేశారు ఆర్ఎస్పీ. ఇదిలా ఉండగా దారుణ హత్యకు గురై జైలుపాలైన ముద్దాయిలుగా ఉన్న ఐదుగురుకు బిగ్ రిలీఫ్ ఇచ్చేలా చేసింది కోర్టు. మధ్యంతర బెయిల్ పొందిన వారిలో పండుగ నారాయణ రెడ్డి, రేఖమయ్య, భజన రంగ నాయకులు, వడ్డే కొండ, ఓబి రెడ్డిలకు ఉన్నారు. షరతులతో కూడిన బెయిల్ పొందారు.