అక్రమ కట్టడాల కూల్చివేతతో అలర్ట్
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ లో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది. దీంతో సీనియర్ పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ కు బాధ్యతలు అప్పగించాక దూకుడు మరింత పెంచారు. అంతే కాకుండా ఇప్పటి వరకు 18కి పైగా భవనాలను కూల్చి వేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత నేలమట్టం చేయడం జరుగుతోంది.
దీంతో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరికొందరు అక్రమార్కులు తెలివిగా కూల్చకుండా ఉండేందుకు గాను హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. తాజాగా అక్కినేని నాగార్జున తాను అక్రమంగా కట్టలేదని, కావాలని కూల్చారంటూ కోర్టుకు ఎక్కారు. కోర్టు కూల్చవద్దంటూ స్టే ఇచ్చింది.
అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా అక్రమంగా నిర్మించారని స్పష్టం చేశారు. దానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. నాగార్జున తప్పుడు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు అడ్డు పడినా కూల్చడం ఆపబోమంటూ హెచ్చరించారు. దీంతో రంగనాథ్ కు మద్దతు పెరిగినా అక్రమార్కులు దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందనే సమాచారం అందడంతో ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను పెంచారు.