అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ
అస్సాం – అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమని జోష్యం చెప్పారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీకి ఇంకా రాజకీయాలు వంట బట్టలేదన్నారు. ఆయనకు ఈ దేశం ఇంకా అర్థం కావడానికి కొన్నేళ్లు పడుతుందని చెప్పారు.
రోజు రోజుకు భారతీయ జనతా పార్టీకి దేశ వ్యాప్తంగా ఆదరణ మరింత పెరుగుతోందని చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు. ఇక ఆ పార్టీలో మిగిలేది మాత్రం ఆ కుటుంబం మాత్రమేనని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ వచ్చినప్పుడుల్లా ఆ పార్టీకి చెందిన వారంతా తమ పార్టీలో చేరుతున్నారని, ఈసారి ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో అస్సాంకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు సీఎం హిమంత బిశ్వా శర్మ.
ఆయన వస్తే ఆ పార్టీకి చెందిన వారు తమ పార్టీలో చేరుతారంటూ సెటైర్ వేశారు . మొత్తంగా ఈసారి కూడా తాము 400 సీట్లకు పైగా సాధించ బోతున్నామని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.