హిందూజా కుటుంబానికి జైలు శిక్ష
భారత సంతతికి కోలుకోలేని షాక్
స్విట్లర్లాండ్ – భారత దేశానికి చెందిన హిందూజా కుటుంబానికి కోలుకోలేని షాక్ తగిలింది. స్విట్జర్లాండ్‌లో జైలు శిక్ష పడింది. ఈ దేశంలో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటిగా పేరుంది. హిందూజా ఫ్యామిలీకి చెందిన నలుగురికి నాలుగున్నర ఏళ్ల జైలు శిక్ష విధించింది స్విట్జర్లాండ్ క్రిమినల్ కోర్టు.
భారత దేశం నుంచి మనుషులను అక్రమంగా తరలించడం, తమ ఇళ్లల్లో అతి తక్కువ జీతానికి పని చేయించుకుంటున్నారని తేల్చింది కోర్టు. శిక్ష పడిన వారిలో ప్రకాశ్ హిందూజా, అతని భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
భారతీయ గృహ కార్మికులను దోపిడీ చేసినందుకు గాను హిందూజా కుటుంబంలోని నలుగురికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఇదిలా ఉండగా భారత్ కు చెందిన కార్మికుల పాస్ పోర్టులు జప్తు చేయడం, వేతనం లేకుండా రోజుకు 16 గంటల పాటు పని చేయించారంటూ బాధితులు ఆరోపించారు కోర్టులో.
ఇదిలా ఉండగా హిందూజా కుటుంబం తరపున వాదించిన లాయర్లు పూర్తిగా తప్పు అని, ఇది కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు.