స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా
జమ్మూ కాశ్మీర్ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ఘటన వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ ఘటనకు కారకులైన వారిని ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇప్పటికే ఎంతమంది టెర్రరిస్టులు పాల్గొన్నారనేది వెల్లడించడం జరిగిందన్నారు. ఊహా చిత్రాలు కూడా రిలీజ్ చేశామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ఘటనా స్థలాన్ని షా పరిశీలించారు. అక్కడి నుంచి భారీ భద్రత మధ్య ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. పిరికిపంద చర్యగా అభివర్ణించారు.
ఇదిలా ఉండగా మరోసారి నోరు పారేసుకున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ . ఉగ్రదాడికి పాల్పడింది తామేనంటూ నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన షాడో గ్రూప్ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 1947లో విభజనకు ఆధారమైన రెండు దేశాల సిద్దాంతాన్ని జనరల్ మునీర్ కూడా సమర్థించారు. పహల్గామ్ జిల్లాలోని సుందరమైన హిమాలయ ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో ఈ దాడి జరిగింది. ఏప్రిల్ 16న ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్తానీయుల సమావేశంలో జనరల్ మునీర్ కాశ్మీర్ గురించి మాట్లాడారు. మేం కాశ్మీర్ ను మరిచి పోయే ప్రసక్తి లేదన్నారు.