హోం మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – నెల్లూరు జిల్లా జైలు అధికారి ఆడియో అంటూ మీడియాలో వస్తోన్న ఆరోపణలపై హోం మంత్రి అనిత స్సందించారు. విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ ను ఆదేశించారు.
మాజీ ఖైదీ బంధువు, జైలు అధికారి మధ్య సంభాషణగా వస్తున్న కథనాలపై నిగ్గు తేల్చాలన్నారు. మిలాఖత్ ల కోసం ఖైదీల బంధువుల నుంచి అవినీతికి పాల్పడినట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చట్ట విరుద్ధమైన అవినీతి, అక్రమాలను కూటమి ప్రభుత్వం సహించబోదని హచ్చరించారు వంగలపూడి అనిత.
ఇదిలా ఉండగా కూటమి సర్కార్ కొలువు తీరాక పలు సంఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల పోలీస్ శాఖ పరంగా ఘటనలు చోటు చేసుకోవడం విస్తు పోయేలా చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం బహిరంగంగానే విమర్శించారు.
ఇలా సున్నితంగా ఉంటే ఎలా అంటూ హొం మంత్రిపై నోరు పారేసుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ. దళిత మహిళ అయినందుకే ఇలా అంటున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కామెంట్స్ చేయడం ఆపేశారు.