హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – నూతన టెక్నాలజీని ఉపయోగించి నేరాలను నియంత్రించడం జరుగుతుందని చెప్పారు హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్ మండలంలోని గండిగుంటలో కొత్త పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హాజరయ్యారు. ఎక్సైజ్ శాఖలో సమూల మార్పులు సంస్కరణలు కొల్లు రవీంద్ర తీసుకు వస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. 2014-19లో చేపట్టిన పనులు గత ప్రభుత్వంలో ఆగి పోయాయని ఆరోపించారు. కూటమి సర్కార్ వచ్చాక వాటిని తిరిగి చేపట్టడం జరుగుతోందన్నారు.
ఈ ప్రారంభోత్సవానికి మూల స్తంభాలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. శ్రమదానం, జన్మభూమి కార్యక్రమాలు చంద్రబాబు సామాజిక బాధ్యతకు నిదర్శనం అన్నారు వంగలపూడి అనిత. ఉన్నఊరు, కన్నతల్లిని మరవొద్దన్నదే సీఎం సిద్ధాంతం అన్నారు. ఐదేళ్లు ఆగిన పనులను తిరిగి చేపట్టి పూర్తి చేయడం గర్వ కారణంగా ఉందన్నారు. విజిబుల్‌తో పాటు ఇన్విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఏపీలోనే కృష్ణా జిల్లాలో అత్యధిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు జిల్లా ఎస్పీని, మంత్రిని అభినందించారు.