Sunday, April 6, 2025
HomeNEWSANDHRA PRADESHఏనుగుల దాడి ఘ‌ట‌న బాధాక‌రం

ఏనుగుల దాడి ఘ‌ట‌న బాధాక‌రం

హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి – అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగుల దాడిలో శివ స్వాములు మృతి చెంద‌డం ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఈ సంద‌ర్బంగా ఎస్పీ వి. విద్యా సాగ‌ర్ తో ఫోన్ లో మాట్లాడారు. వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్య సౌక‌ర్యం అందించాల‌ని ఆదేశించారు. బాధిత కుటుంబాల‌కు ప్రభుత్వం అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపంలోని గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడి దర్శనానికి వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాట్లు చేయాలని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఏపీలోని అన్న‌మ‌య్య జిల్లాలో ఏనుగులు బీభ‌త్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వ‌ద్ద భక్తులపై దాడి చేశాయి. ముగ్గురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారిని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి వెళ్తుండగా ఏనుగులు దాడి చేశాయి. అటవీ అధికారులు ఘటనపై ఆరా తీస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments