హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటన
విశాఖపట్నం – సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు హోం మంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో హోం మంత్రికి ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ చైర్మన్, ఈవో, అర్చకులు. కప్ప స్తంభం ఆలింగనం , స్వామి వారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేశారు పండితులు. స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. చందనోత్సవం నేపథ్యంలో
ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. స్వామి వారిని దర్శనం అనతరం మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. చందనోత్సవం నేపథ్యంలో సామాన్య భక్తుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. శ్రీవరహా లక్ష్మి నరసింహా స్వామి వారిని, భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అంతరాలయ దర్శనాలు ఉదయం ఆరు గంటలతో ముగిస్తాయని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటాన్నామని స్పష్టం చేశారు మంత్రి అనిత వంగలపూడి. పెద్ద సంఖ్యలో బస్సులు కూడా సిద్దంగా ఉంచామన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు వెళుతున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మంత్రుల బృంధం చందనోత్సవం ఏర్పాట్లుపై సమీక్షించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నాని చెప్పారు. ఎన్డియే ప్రభుత్వంలో ఇటీవలే వివిధ ఆలయాల్లో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.