Saturday, May 24, 2025
HomeDEVOTIONALఅభివృద్ది ప‌థంలో ఏపీ ముందుండాలి

అభివృద్ది ప‌థంలో ఏపీ ముందుండాలి

తిరుమ‌ల స‌న్నిధిలో మంత్రి వంగ‌ల‌పూడి

తిరుమ‌ల – ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆ దేవ దేవుడిని కోరుకున్నాన‌ని అన్నారు. విజన్‌- 2047, పీ-4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకు రావాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌కు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు బాగుండాలని ప్రార్థించినట్లు అనిత తెలిపారు. శ్రీరామనవమి నాడు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో భాగ్యమని హోంమంత్రి అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు తిరుమలలోరి భూ వరాహ స్వామి ఆలయాన్ని హోం మంత్రి అనిత దర్శించుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments