TELANGANANEWS

సోలార్ ఆధారిత విద్యుత్ ప్లాంట్

Share it with your family & friends

ఏర్పాటుకు హెచ్ పీ సీ ఎల్ సుముఖ‌త

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ భార‌తీయ ప్ర‌భుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ పెట్రోలియ‌మ్ కార్పొరేష‌న్ ( హెచ్ పీ సీ ఎల్ ) ప్ర‌తినిధుల బృందం మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యింది.

ఈ సంద‌ర్బంగా సోలార్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ల ఏర్పాటుపై చ‌ర్చించింది. ఈ మేర‌కు సీఎం సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. త‌మ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు ఇతోధికంగా స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

అపార‌మైన వ‌న‌రులు క‌లిగిన ప్రాంతం తెలంగాణ అని, వీటిని గుర్తించి స‌ద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్య‌త స‌ర్కార్ పై ఉంటుంద‌న్నారు. ఈ మేర‌కు కేంద్రం కూడా దేశ వ్యాప్తంగా సౌర విద్యుత్ ను ప్రోత్స‌హించడంలో భాగంగా కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు.

ఇందులో భాగంగా తెలంగాణలో హిందూస్థాన్ పెట్రోలియ‌మ్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో సోలార్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు కంపెనీ ప్ర‌తినిధులు. వీరిని ప్ర‌త్యేకంగా అభినందించారు ఎనుముల రేవంత్ రెడ్డి.