సత్య నాదెళ్ల..పిచాయ్..నీల్ మోహన్
ఇండియా – హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అత్యంత జనాదరణ పొందిన టాప్ కంపెనీల సీఈవోల జాబితాను ప్రకటించింది. ప్రవాస భారతీయులైన కీలక సీఈఓలు ముగ్గురు ఇందులో టాప్ లో చోటు దక్కించుకున్నారు. మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ను ఎంపిక చేశారు. ఈ ముగ్గురు టాప్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ నాయకులలో ఉన్నారు. ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ కంపెనీ టాప్ లో కొనసాగుతోంది. సత్య నాదెళ్ల ఏపీకి చెందిన తెలుగు వారు. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ యుగంధర్ తనయుడు. సత్య నాదెళ్ల బేగంపేట హైస్కూల్ లో చదివారు. ప్రస్తుతం కంపెనీకి సిఈవోగా ఉన్నారు.
ఇక సుందర్ పిచాయ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. టాప్ ఐఐటియన్ గా ఉన్నారు. ఆండ్రాయిడ్ ను డెవలప్ చేశారు. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజ్ చేస్తున్నారు. ప్రపంచ సెర్చింగ్ సంస్థలలో గూగుల్ ఒకటిగా వెలుగొందుతోంది. మరో వైపు నీల్ మోహన్ కూడా ఇండియాకు చెందిన టాప్ మోస్ట్ ఐఐటియన్. తను కూడా యూట్యూబ్ సిఇఓగా కొనసాగుతున్నారు. యూట్యూబ్ అనేది గూగుల్ లో అంతర్భాగంగా ఉంది.