ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం
తిరుమల – తిరుమల భక్త బాంధవులతో పోటెత్తుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. వేసవి కాలం కావడం, సెలవులు రావడంతో భారీ ఎత్తున తరలి వస్తున్నారు పుణ్య క్షేత్రానికి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్న ప్రసాదాలతో పాటు తాగు నీటిని పంపిణీ చేస్తోంది టీటీడీ. తిరుమలకు రికార్డు స్థాయిలో 90 వేల 211 మంది దర్శించుకున్నారు ఈవో జె. శ్యామల రావు. గత వారం రోజుల నుండి భక్తుల తాకిడి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
వైకుంఠం కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు, బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ ఏర్పాట్లను విస్తృతంగా చేపట్టింది. టీటీడీ యంత్రాంగం కృషితో శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది.
మే నెలలో 24 రోజుల వ్యవధిలో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటూ ఇతర అన్నప్రసాద కేంద్రాల్లో కలిపి 51 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా శ్రీవారి సేవకులు విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ సేవల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.