మంత్రి రామ్మోహన్ నాయుడు
ఢిల్లీ – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. భారత దేశంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. గరుడ ఏరోస్పేస్ కేంద్ర సర్కార్ తో ఒప్పందం చేసుకునేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. డ్రోన్ సిటీ ఏర్పాటు కోసం రూ. 100 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిందన్నారు. డ్రోన్ లాజిస్టిక్స్ ను పెంచేందుకు యూటీఎం, పీఎల్ఐ, డీఎల్ఐ, ఎస్ఎల్ఐ, బీవీఎల్ఓఎస్ రూల్స్ కు సంబంధించి చర్చించడం జరిగిందన్నారు కేంద్ర మంత్రి.
ఇప్పటి వరకు ఇదే బిగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందన్నారు రామ్మోహన్ నాయుడు. గరుడ ఏరో స్పేస్ చీఫ్ తనో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. టెక్నాలజీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, విమానయాన సంస్థ పరంగా కీలక సంస్కరణలు తీసుకు వచ్చామని చెప్పారు.
కేంద్ర సర్కార్ బడ్జెట్ లో విమానయాన రంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయించిందన్నారు. ప్రయాణీకులకు సంబంధించి మరిన్ని సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యల కారణంగా విమానాల రాక పోకలు, వసతి సౌకర్యాల కల్పన, ఎయిర్ పోర్ట్ లలో సేవలు మరింత మెరుగు పడ్డాయని చెప్పారు.