Saturday, May 24, 2025
Homeటీటీడీకి భారీగా సిఫార్సు లేఖ‌లు

టీటీడీకి భారీగా సిఫార్సు లేఖ‌లు

వెల్ల‌డించిన ఈవో జె. శ్యామ‌ల రావు

తిరుమ‌ల – టీటీడీకి పెద్ద ఎత్తున సిఫార్సు లేఖ‌లు అందాయి. మార్చి 24 నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు సంబంధించిన సిఫార్సు లేఖ‌లు స్వీక‌రిస్తామ‌ని ఈవో శ్యామ‌ల రావు ప్ర‌క‌టించారు. దీంతో ఇవాళ ఒక్క రోజే 90 మంది ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి లేఖ‌లు అందాయ‌ని పేర్కొన్నారు. 180 మంది ప్ర‌జా ప్ర‌తినిధుల లేఖ‌లు స్వీక‌రించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా టీటీడీ ఇంతకు ముందు ప్రకటించినట్లుగా, మార్చి 25, 30 తేదీలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, శ్రీ విశ్వవాసు నామ సంవత్సర తెలుగు ఉగాది ఆస్థానం దృష్ట్యా సంబంధిత తేదీలలో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించి త‌మ‌తో స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు ఈవో.

ఈ కారణంగా భక్తుల స్పష్టత కోసం మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం మార్చి 24న , మార్చి 30న దర్శనం కోసం మార్చి 29న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బోమంటూ పేర్కొన్నారు ఈవో.

అదేవిధంగా సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఆదివారం ఆంధ్ర ప్రజా ప్రతినిధుల నుండి అందుకున్న సిఫార్సు లేఖలను ఇకపై ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనం కోసం శనివారం స్వీకరిస్తామన్నారు. భక్తులు ఈ మార్పులను గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments