ఏపీలో భారీగా పోలింగ్
పోటెత్తిన ఓటర్లు
అమరావతి – ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. భారీ ఎత్తున ఓటర్లు పోటెత్తారు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు. రాష్ట్రంలో పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తాడిపత్రితో పాటు తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా ఓటర్ పై దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు ఏపీలో. ఆరు గంటల్లో ఏకంగా 40.26 శాతం పోలింగ్ నమోదు కావడం విస్తు పోయేలా చేసింది. ఇప్పటి వరకు 1.70 కోట్ల మంది ఓటు హక్కు వినియోగాంచు కోవడం విశేషం. అత్యంధికంగా కడప జిల్లాలో 45.5 శాతం మేర పోలింగ్ జరిగింది. తర్వాతి స్థానాల్లో కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాల వారీగా చూస్తే పిలువెందుల నియోజకవర్గంలో 50 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. అల్లూరి జిల్లాలో 32.60 శాతం , అనకాపల్లి జిల్లాలో 37 శాతం, అనంతపురం జిల్లాలో 39.82, అన్నమయ్య జిల్లాలో 39.60 శాతం నమోదైంది.
బాపట్ల జిల్లాలో 44.45 శాతం, చిత్తూరు జిల్లాలో 44.50 శాతం , కోనసీమ జిల్లాలో 44.03 శాతం, తూర్పు గోదావరి జిల్లాలో 38. 54 శాతం , ఏలూరు జిల్లాలో 38.79 శాతం , గుంటూరు జిల్లాలో 40.12 శాతం , కాకినాడ జిల్లాలో 38.25 శాతం , కృష్ణా జిల్లాలో 44.50 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక కర్నూలు జిల్లా పరంగా చూస్తే 38 శాతం, నంద్యాల జిల్లాలో 44.20 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 39.60 శాతం, పల్నాడు జిల్లాలో 40.53 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 34.87 శాతం, ప్రకాశం జిల్లాలో 42.78 శాతం, నెల్లూరు జిల్లాలో 42.38 శాతం , సత్యసాయి జిల్లాలో 38.10 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 40.56 శాతం, తిరుపతి లో 39.14 శాతం , విశాఖ జిల్లాలో 33.72 శాతం , విజయనగరం జిల్లాలో 40.30 శాతం, పశ్చిమ గోదావరి జిల్లాలో 39.50 శాతం, కడప జిల్లాలో 45.56 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.