సంధ్య థియేటర్ యజమానికి నోటీస్
మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు
హైదరాబాద్ – పుష్ప-2 ప్రీమియర్ షో సందర్బంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యానికి చిక్కపడపల్లి పోలీసులు మరోసారి ఝలక్ ఇచ్చారు. తదుపరి చర్యలకు సిద్దమవుతున్నారు. తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లేకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించినా పట్టించు కోలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇవ్వడం షాక్ కు గురి చేసింది.
ఇప్పటి వరకు ఎలాంటి వివరణ తమకు ఇవ్వలేదని ఈ సందర్బంగా పోలీసులు పేర్కొన్నారు. అందుకే ఇంకోసారి సంధ్య థియేటర్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేస్తూ నోటీసులు జారీ చేశామన్నారు. కాగా ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాట దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ ఘటనలో రేవతి అనే మహిళ చని పోగా మరో చిన్నారి శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. తను చావు బతుకుల్లో ఉన్నాడు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ కారణమంటూ కేసు నమోదు చేశారు. తనను జైలుకు పంపించారు. హైకోర్టు జోక్యంతో తిరిగి బయటకు వచ్చాడు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు.