Friday, April 4, 2025
HomeNEWSతుంగ‌భ‌ద్ర న‌దిలో డాక్ట‌ర్ మిస్సింగ్

తుంగ‌భ‌ద్ర న‌దిలో డాక్ట‌ర్ మిస్సింగ్

గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం

క‌ర్ణాట‌క – హైద‌రాబాద్ కు చెందిన డాక్ట‌ర్ అన‌న్య రావు కొప్ప‌ల్ జిల్లా గంగావ‌తి తాలూకా లోని స‌నాపూర్ గ్రామం స‌మీపంలో తుంగ‌భ‌ద్ర న‌దిలో దూకి అదృశ్య‌మ‌య్యారు. స్నేహితుల‌తో క‌లిసి వెళ్లారు. అగ్నిమాప‌క శాఖ , పోలీసులు , డైవింగ్ నిపుణుల సహాయంతో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అన‌న్య రావు వ‌య‌సు 26 ఏళ్లు.

త‌ను ఒక రాతి బండ‌పై నుండి న‌దిలో దూకుతున్న‌ట్లు క‌నిపించే సంఘ‌ట‌న‌కు సంబఃధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. అన‌న్య రావు స్నేహితులు సాత్విక్, అషిత‌తో క‌లిసి వారాంత‌పు విశ్రాంతి కోసం స‌నాపూర్ గ్రామంలోని ఒక గెస్ట్ హౌస్ కు వ‌చ్చారు.

ఫిబ్ర‌వరి 19వ తేదీన బుధ‌వారం ఉద‌యం 8.30 గంట‌ల ప్రాంతంలో న‌దిలో దూకేందుకు ముగ్గురూ నిర్ణ‌యించుకున్నారు. ఆ త‌ర్వాత అన‌న్య రావు క‌నిపించ‌కుండా పోయారు. ఆనకట్ట విడుదల కారణంగా నీటి ప్రవాహం బలంగా ఉండటం వల్ల నదిలోకి దూకవద్దని నిర్వాహక సిబ్బంది అన‌న్య రావుకు సలహా ఇచ్చారని స్థానిక టూర్ ఆపరేటర్లు నివేదించారు.

అనన్య లైఫ్ జాకెట్ లేకుండానే దూకాలని పట్టుబట్టింది, తాను ఇంతకు ముందు ఇలాంటి జంప్స్ చేశానని చెప్పింది. ఆమె దూకిన రాయి 20 అడుగుల ఎత్తు ఉంది. నీటి ప్రవాహం బలంగా ఉంది. నిర్వాహకులు ఆమెను లైఫ్ జాకెట్ ధరించమని చెప్పినా ప‌ట్టించు కోలేద‌ని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments