శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్
సీపీ సీవీ ఆనంద్ వెల్లడి
హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను సీపీ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా పరామర్శించారు. తొక్కిసలాటలో శ్రీతేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందన్నారు సీపీ .
కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని చెప్పారు . ట్రీట్‌మెంట్ మరింత ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నామన్నారు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా.
అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలపడంలో సంధ్య థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారని ఆరోపించారు సీపీ సీవీ ఆనంద్.. తన రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నా.. ఎంట్రీ, ఎగ్జిట్, సీటింగ్ ప్లాన్ చేయలేదని మండిపడ్డారు.
అర్జున్‌తో పాటు అతని ప్రైవేట్ సెక్యూరిటీని లోపలికి అనుమతించారని చెప్పారు సీపీ సీవీ ఆనంద్.. టిక్కెట్‌ల తనిఖీ కోసం సరైన వ్యవస్థ లేదన్నారు.. అనధికారిక ప్రవేశానికి అనుమతించి లోపల రద్దీ పెరిగేలా చేశారని ధ్వజమెత్తారు.
ఇదిలా ఉండగా సంధ్య థియేటర్ లైసెన్స్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారు చిక్కడపల్లి పోలీసులు.. తొక్కిసలాటలో ఒకరి మృతికి కారణమైన సంధ్య థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదంటూ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.