సీపీ సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్ – సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సీరియస్ కామెంట్స్ చేశారు. చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాలు) లో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేసినా లేదా ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు .
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే తాము వీడియోలు విడుదల చేశామని తెలిపారు. గీత దాటితే తాట తీస్తామని పేర్కొన్నారు. వీడియోలు పెట్టినా, కామెంట్స్ చేసినా కటకటాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని , అది గుర్తు పెట్టుకుంటే మంచిదని సూచించారు సీపీ.
కానీ కొందరు ఉద్దేశ పూర్వకంగా పోస్టులు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, ఈ సమయంలో ఇలాంటి ఉద్దేశ పూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మరోసారి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.