ఈ నంబర్ల నుంచి ఫోన్ వస్తే జాగ్రత్త
సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ – అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌లపై అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఈ నంబర్ల నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ వస్తే ఎత్తరాదన్నారు. ప్రధానంగా +371 (లాత్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్‌లతో మొదలయ్యే నంబరుతో రింగ్ చేసి ఎత్తిన తర్వాత హ్యాంగ్ చేస్తారన్నారు.
తిరిగి ఫోన్ చేస్తే కాంటాక్ట్ జాబితాతో పాటు బ్యాంకు, క్రెడిట్ కార్డు ఇతర వివరాలు మూడు సెకన్లలో కాపీచేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా #90 లేదా #09 నంబర్లను నొక్కాలని ఎవరైనా సూచిస్తే ఆ ప్రయత్నం చేయొద్దన్నారు.
అలా చేస్తే మీ సిమ్ కార్డుని యాక్సెస్ చేయడానికి, మీ ఖర్చుతో కాల్ చేయడానికి, మిమ్మల్ని నేరస్థుడిగా చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా గుర్తించాలని తెలిపారు.