NEWSTELANGANA

ఓలా కు ఫోరం భారీ జ‌రిమానా

Share it with your family & friends

లేక‌పోతే జ‌రిమానా విధించే ఛాన్స్

హైద‌రాబాద్ – ఇవాళ హైద‌రాబాద్ లో ఎక్క‌డికి వెళ్లాల‌న్నా క్యాబ్ ల‌ను ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌డం లేదు. దీనికి కార‌ణం స‌రైన ర‌వాణా స‌దుపాయం లేక పోవ‌డ‌మే. బ‌స్సులు ఉన్నా కేవ‌లం ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో మాత్ర‌మే న‌డుస్తుండ‌డంతో వేలాది మంది త‌మ అవ‌స‌రాల కోసం ప్ర‌తి రోజూ క్యాబ్ (ఓలా, ఊబ‌ర్ ) ల‌లో ప్ర‌యాణం చేస్తున్నారు. దీనిని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు ట్యాక్సీ డ్రైవ‌ర్లు శుభ్ర‌త పాటించ‌డం లేదు. ఇంకొంద‌రు అధికంగా వ‌సూలు చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

తాజాగా హైద‌రాబాద్ జిల్లా వినియోగ‌దారుల వివాదాల ప‌రిష్కారా క‌మిష‌న్ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ప్ర‌యాణీకుల‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఓలా క‌స్ట‌మ‌ర్ కు రూ. ల‌క్ష రూపాయ‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని ఆదేశించింది ఓ పిటిష‌న్ కు సంబంధించి.

ఓలాకు చెందిన క్యాబ్ డ్రైవ‌ర్ ప్ర‌వ‌ర్త‌న‌, అప‌రిశుభ్రంగా ఉంచ‌డంపై బాధితులు జిల్లా వినియోగ‌దారుల వివాదాల క‌మిష‌న్ ను ఆశ్ర‌యించారు. అధికంగా ఛార్జీలు త‌మ నుంచి వ‌సూలు చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప‌రిశుభ్రంగా ఉంద‌ని, దుర్వాస‌న వ‌స్తోంద‌ని, ఏసీని ఆన్ చేయాల‌ని కోరినా డ్రైవ‌ర్ ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. 5 కిలోమీట‌ర్లు వెళ్ల‌గానే డ్రైవ‌ర్ దంప‌తుల‌ను క్యాబ్ లో నుంచి దించేశాడు. దీనికి రూ. 861 వ‌సూలు చేశాడ‌ని తెలిపారు. 12 శాతం వ‌డ్డీతో రూ. 861 తిరిగి చెల్లించాల‌ని ఓలాను ఆదేశించింది.