మైత్రీ మూవీ మేకర్స్ పై కేసు
బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు
హైదరాబాద్ – సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్. A9, A10 సెక్యూరిటీ సిబ్బంది సంధ్య. ఫ్లోర్ ఇన్‌చార్జ్. A12 నుంచి A17వరకు అల్లు అర్జున్ బౌన్సర్లు. A18గా మైత్రి మూవీమేకర్స్‌ను చేర్చారు. ఇప్పటికే A11గా అల్లు అర్జున్‌ను చేర్చిన విషయం తెలిసిందే.
మరో వైపు నిన్న మంత్రి కోమటిరెడ్డితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు రూ. 50 లక్షల చెక్కును బాధిత తండ్రి భాస్కర్ కు అందజేశారు. ఇవాళ ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి పరామర్శించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సందర్శించారు.
ఇవాళ ఈ కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ కేసు విచారణ ముగిసింది. భారీ బందోబస్తు మధ్య చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఏసీపీ, డీసీపీ ఆధ్వర్యంలో మూడున్నర గంటలకు పైగా విచారణ చేపట్టారు. 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
విచారణ పూర్తయిన వెంటనే గట్టి బందోబస్తు మధ్య ఇంటికి చేరుకున్నారు బన్నీ. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కాన్వాయ్ తో ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు.