ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు
27న విచారణకు హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలింది. బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విధులు నిర్వహిస్తున్న సీఐకి ఆటంకం కలిగించినందుకు గాను ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు . కేసు విచారణకు సంబంధించి ఈనెల 27న ఉదయం 10 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఇంకా స్పందించ లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో పాడి కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తన, కామెంట్స్ కీలకంగా మారాయి. ఆయన అప్పట్లో గవర్నర్ గా ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు తమిళి సై సౌందర రాజన్ పై నోరు పారేసుకున్నారు. ఆ తర్వాత సారీ చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. నోటి దూలను తగ్గించు కోవాలని సూచించారు.
కానీ బీఆర్ఎస్ హై కమాండ్ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా ఆయనకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. ఈటల రాజేందర్ ను ఓడించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం దూకుడుగా వ్యవహరించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కొంచెం ఆగ్రహం వ్యక్తమైంది.