మరోసారి అజ్ఞాతంలోకి మోహన్ బాబు
16వ తేదీ నుంచి పోలీసుల గాలింపు
హైదరాబాద్ – జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మంచు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో తనను అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. తిరుపతి లోని శ్రీ విద్యా నికేతన్ నుంచి వెళ్లి పోయినట్లు సమాచారం. ఈనెల 16వ తేదీన హైదరాబాద్ నుంచి ఎవరికీ చెప్పకుండా బెంగళూరుకు వెళ్లారు. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. కానీ చిక్కడం లేదు.
విచిత్రం ఏమిటంటే చిన్న తప్పు జరిగితే కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసే పోలీసులకు విచిత్రంగా మంచు మోహన్ బాబు చిక్కక పోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఆయనతో పాటు ఇద్దరు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ పై కేసులు నమోదు చేశారు.
జల్ పల్లి ఫామ్ హౌస్ వద్ద చోటు చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. టీవీ9 రిపోర్టర్ పై తీవ్రంగా దాడి చేశాడు మోహన్ బాబు. తండ్రీ కొడుకులకు సంబంధించిన గన్స్ ను సీజ్ చేశారు. ఇదే సమయంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంచు విష్ణు, మనోజ్ కంట్రోల్ లో ఉండాలని లేక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.