హైదరాబాద్ రేస్ క్లబ్ రూ. 2 కోట్ల విరాళం
సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేత
హైదరాబాద్ – ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సీఎం తక్షణ సాయంగా రూ. 5000 కోట్లు ఇవ్వాలని కోరారు కేంద్ర సర్కార్ ను.
జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు, కంపెనీల ప్రతినిధులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.
ఇందులో భాగంగా వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ రేస్ క్లబ్ నిర్వాహకులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 కోట్లను విరాళంగా అందజేసింది.
రేస్ క్లబ్ డైరెక్టర్, లోక్‌సభ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి, మరో డైరెక్టర్ నర్సింహారెడ్డిలు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిసి ఈ మేరకు చెక్కును అందించారు.
వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహాయంగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం హైదరాబాద్ రేస్ క్లబ్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.