హైదరాబాద్ ను రాజధాని చేయాలి
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్ – మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లకు గాను మొత్తం సీట్లలో తమ పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఒక వేళ అలా గెలిపిస్తే కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సంకీర్ణ సర్కార్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను రెండవ రాజధానిగా చేయాలని కోరుతామని ప్రకటించారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం కానీ లేదా దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. రెండవ రాజధానిగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు హైదరాబాద్ కు కలుగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బూర చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
దేశానికి తొలి రాజధాని ఢిల్లీ ఉండగా దానికంటే ఎక్కువగా భౌగోళిక ప్రయోజనాలు హైదరాబాద్ కలిగి ఉందన్నారు. అలా అయినప్పుడు రెండో రాజధానిగా ఉండాలని కోరు కోవడంలో తప్పు లేదని తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.