సన్నీ లియోన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్
అర్దాంతరంగా ఈవెంట్ రద్దు
హైదరాబాద్ – హైదరాబాద్ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు నటి సన్నీ లియోన్ షో ఈవెంట్ నిర్వాహకులకు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని ఇల్యూజన్ పబ్ లో నిర్వహించదల్చిన డీజే ఈవెంట్ కు అనుమతి ఇవ్వడం లేదంటూ స్పష్టం చేశారు పోలీసులు.
దీంతో సన్నీ లియోన్ షోను ఎంజాయ్ చేద్దామని అనుకున్న ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. ఈ ప్రోగ్రామ్ ను శనివారం రాత్రి 11 నుండి 12.30 వరకు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. బుక్ మై షో ద్వారా 500 టికెట్లు విక్రయించారు. కానీ ఈవెంట్ రద్దుతో తీవ్ర నిరాశకు లోనయ్యారు సన్నీ లియోన్ ఫ్యాన్స్.
నిర్వాహకులు తమ వారాంతపు వేడుకల్లో భాగంగా సన్నీ లియోన్ ద్వారా ప్రత్యక్ష DJ ప్రదర్శనను ప్లాన్ చేశారు. పోలీసులు నిరాకరించినా ఈవెంట్ ను కొనసాగించాలనే ఉద్దేశంతో నిర్వాహకులు సన్నీ లియోన్ ను హైదరాబాద్ కు తీసుకు వచ్చారు. కార్యక్రమం జరగకుండా పోలీసులు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా ఇప్పటికే టికెట్లు తీసుకున్న ఫ్యాన్స్ సన్నీ లియోన్ కోసం రాత్రి 8 గంటలకే అక్కడికి విచ్చేశారు. చివరకు నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు . ఆమెకు అనారోగ్యం ఉండడంతో ఈవెంట్ ను రద్దు చేసినట్లు వెల్లడించారు.