NEWSTELANGANA

రియ‌ల్ ఎస్టేట్ య‌జ‌మానుల‌కు భ‌రోసా

Share it with your family & friends

అనుమ‌తులు ఉంటే వాటిని కూల్చ‌బోం

హైద‌రాబాద్ – హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. గ‌త కొన్ని రోజుల నుంచి స్త‌బ్దుగా ఉన్న ఉన్న‌ట్టుండి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

తాము రియ‌ల్ ఎస్టేట్ ల జోలికి వెళ్ల‌బోమంటూ స్ప‌ష్టం చేశారు. కొంద‌రు కావాల‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అలాంటి ఫేక్ ప్ర‌చారం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. తాము ఎలా ప‌డితే అలా భ‌వ‌నాల‌ను, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ల‌ను కూల్చ‌మ‌ని పేర్కొన్నారు.

పూర్తిగా స‌మాచారం వ‌చ్చాక‌, అన్ని అనుమ‌తులు ఉన్నాయో లేదోన‌ని స‌రి చూసుకుని , నోటీసులు ఇస్తామ‌ని ఆ త‌ర్వాత కూల్చ‌డం మొద‌లు పెడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ ప‌ర్మిష‌న్స్ లేక పోతే కూల్చ‌డం త‌ప్ప‌ద‌న్నారు. అయితే అనుమ‌తులు ఉన్న‌ట్ల‌యితే, త‌మ విచార‌ణ‌లో తేలితో వాటి జోలికి , వాటి ద‌రి దాపుల్లోకి కూడా వెళ్ల‌బోమంటూ తెలిపారు ఏవీ రంగ‌నాథ్.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ల య‌జ‌మానులు భ‌యాందోళ‌న‌కు గురి కావ‌ద్ద‌ని సూచించారు. చెరువుల దగ్గర అనుమతులు ఉన్న నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేస్తుందని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు క‌మిష‌న‌ర్.

.అనుమతులున్న నిర్మాణాలను కూల్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే స్పష్టం చేశారని, ఆయ‌న ఇచ్చిన ఆదేశాల‌కు హైడ్రా క‌ట్టుబ‌డి ఉంటుంద‌న్నారు ఏవీ రంగ‌నాథ్‌.