హైడ్రా కమిషనర్ కేవీ రంగనాథ్
హైదరాబాద్ – ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునపై సీరియస్ కామెంట్స్ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తను అక్రమంగా నిర్మాణాలు చేపట్టడమే కాకుండా హైకోర్టుకు వెళ్లడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. నటుడిగా సినిమాలలో సందేశాలు చెప్పే నాగార్జున ఇలా ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఎలా ఆక్రమించు కుంటారని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇవాళ తాత్కాలికంగా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా ఆ తర్వాత వదిలి పెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు రంగనాథ్.
హైదరాబాద్ నగరంలో చాలా చెరువులను చెర బట్టారని, వారందరి భరతం పడతామని అన్నారు. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు రంఘనాథ్.
విచిత్రం ఏమిటంటే చట్ట విరుద్దంగా ధ్వంసం చేశారని చెప్పడాన్ని తప్పు పట్టారు. తను అనుమతి లేకుండా ఎలా నిర్మించారో ముందు ప్రజలకు చెప్పాలని అన్నారు. తను నటుడైనంత మాత్రాన ఊరుకుంటారని అనుకోవద్దన్నారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు అసలు పర్మిషన్లు లేవని కుండ బద్దలు కొట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పట్టా భూమిలో వ్యవసాయం చేసుకోవాలే తప్పా పెద్ద పెద్ద బంగ్లాలు కట్ట కూడదని, దాని పేరుతో వ్యాపారం చేయొద్దని స్పష్టం చేశారు.
బంగ్లాలు నిర్మించడం పూర్తిగా చట్ట విరుద్దమని అన్నారు. నాగార్జునకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.