కంపెనీలను కోరిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన ఆయన ఉన్నట్టుండి కంపెనీలకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులు తమకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇచ్చే నిధులతో చెరువులను అభివృద్ది చేస్తామని ప్రకటించారు. ఆయా కార్పొరేట్ కంపెనీలు, ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన వారంతా సహకరించాలని కోరారు కమిషనర్. ఇప్పటి వరకు స్వచ్ఛంధ సంస్థలకు ఇస్తూ వచ్చిన కంపెనీలు ఉన్నట్టుండి హైడ్రాకు ఇవ్వాల్సి ఉంటుంది.
గత కొంత కాలంగా హైదరాబాద్, దాని చుట్టు పక్కల ఉన్న చెరువులను కబ్జా చేశారని, వాటిని గుర్తించి కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్. సీఎస్ఆర్ నిధులు ఇస్తే వాటిని అద్భుతంగా తయారు చేస్తామన్నారు. ఔటర్ రింగు రోడ్డు పరిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిస్తామన్నారు. సిఎస్ ఆర్ నిధులతో కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.చెరువుల సుందరీకరణకే పరిమితం కారాదని.. చెరువులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలని సంస్థలకు సూచించారు.
చెరువుల అభివృద్ధికి సీఎస్ ఆర్ నిధులు వెచ్చిస్తున్న, వెచ్చించడానికి సిద్ధంగా ఉన్న దాదాపు 72 సంస్థల ప్రతినిధులతో ఏవీ రంగనాథ్ సమావేశమయ్యారు. జీహెచ్ ఎంసీ లేక్స్ విభాగం అదనపు కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు. తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సీఎస్ ఆర్ వింగ్ డైరెక్టర్ అర్చనా సురేష్‌తో పాటు..హెచ్‌ఎండీఏ, జీహెచ్ ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఈ సమావే శానికి హాజరయ్యారు.