స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగర వాసులకు మరోసారి చావు కబురు చల్లగా చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మొత్తం 1,025 చెరువులను గుర్తించడం జరిగిందని చెప్పారు.
2 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పని చేస్తుందన్నారు. దీనికి సీఎం రేవంత్ చైర్మన్ గా ఉంటారని అన్నారు ఏవీ రంగనాథ్. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తామని చెప్పారు. శాటిలైట్ ఆధారంగా డేటా సిద్దం చేశామని, ఇమేజ్ లు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
త్వరలోనే కూల్చివేతలు ఉంటాయని చెప్పకనే చెప్పారు హైడ్రా కమిషనర్. ఇప్పటికే ప్రభుత్వం మరింత దూకుడుతో ముందుకు వెళుతోంది. ఎలాగైనా సరే మూసీ పరివాహక ప్రాంతం చుట్టూ ఉన్న వారిని ఖాళీ చేయించాలని చూస్తోంది. ఈ తరుణంలో కోర్టు సీరియస్ అయ్యింది కమిషనర్ పై. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే ఎలా కూల్చి వేస్తారంటూ ప్రశ్నించారు జడ్జి.
దీంతో కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్న హైడ్రా కమిషనర్ ఉన్నట్టుండి మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే కూల్చడం ప్రారంభించారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రజలు లబోదిబోమంటున్నారు. ఈ గుర్తించిన చెరువులు ఎక్కడ ఉన్నాయనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. నగరాన్ని ఆంధ్రాకు చెందిన సెటిలర్లు, బిల్డర్లు అందినంత మేర దండుకున్నారు.