స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ – ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటోందన్నారు కమిషనర్ ఏవీ రంగనాథ్. ప్రభుత్వ భూముల కబ్జా జరుగుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై తాను క్షేత్ర స్థాయి పర్యటన చేపట్టానని అన్నారు. మాదాపూర్ లోని గుట్టల బేగంపేట, ఫిలింనగర్ బస్తీ విష్పర్ వ్యాలీ చేరువగా వున్న చెరువు, శంషాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామం, కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామం లో ప్రభుత్వ భూములను కమిషనర్ పరిశీలించారు.ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. రహదారులకు ఆటంకం లేకుండా చుట్టూ ఫెన్సింగ్ వేయడం, ప్రహరీలు నిర్మించి కాపాడుతామన్నారు .
ప్రభుత్వ భూముల కు సంబంధించి త్వరితగతిన సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. భూమి తనది అని పేర్కొంటే సంబంధిత పేపర్లు చూపించాలని సూచించారు. రెవెన్యూ అధికారులతో కలసి. సర్వే చేసి భూముల వివరాలను తెలుసు కోవడమే కాకుండా ఎవరైనా ఆక్రమణలో వుంటే వాళ్ళను ఖాళీ చేయించాలన్నారు. ఉప్పల్ నల్ల చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు.పోచారం మున్సిపాలిటీ కాచవాని సింగరంలోని దివ్యానగర్ లె ఔట్ ను కమిషనర్ సందర్శించారు. ఈ లేఅవుట్ తో పాటు ఏకశిల నగర్ లే ఔట్ లలో పార్కులను, ప్రజావసరాల కు ఉద్దేశించిన స్థలాల కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు.